దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ .

 


భారత్‌కు కొత్త సంవత్సరం రోజున ఊపిరి పీల్చుకునే శుభవార్త వచ్చింది. దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆస్ట్రోజనికా, సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా డెవలప్ చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు నిపుణుల కమిటీ నుంచి అనుమతి లభించింది. అత్యవసర వినియోగానికి నిపుణులు కమిటీ ఓకే చెప్పింది. త్వరలో పంపిణీకి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డిసీజీఐ) నుంచి అనుమతి లభించే అవకాశం ఉంది. దీంతో దేశంలో కరోనాకు తొలి టీకా మరి కొద్దిరోజుల్లో అందుబాటులోకి రానుంది. సమగ్ర విశ్లేషణ తర్వాత, నిపుణుల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది