నేడే ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల వ్యవహారంపై తుది తీర్పు వెలువడే అవకాశం

 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సంఘం,
ప్రభుత్వానికి మధ్య సమన్వయం కుదరక హైకోర్టు పరిధిలోకి వెళ్లిన పంచాయితీ ఎన్నికల వ్యవహారంపై ఇవాళ(21 జనవరి 2021) తీర్పు రానుంది.  ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఈ నెల 8వ తేదీన ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ను సస్పెండ్‌ చేస్తూ ఈ నెల 11న సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వగా.. ఆ ఉత్తర్వులను డివిజన్‌ బెంచ్‌ ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) అప్పీల్‌ చేసింది.  ఈ విషయమై పూర్తి విచారణ అనంతరం.. వాదనలు ముగియగా, చీఫ్‌ జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం తీర్పును నేటికి వాయిదా వేసింది. నేటి హైకోర్టు తీర్పు తర్వాత పంచాయతీ ఎన్నికల నిర్వహణపై క్లారిటీ రాబోతుంది.