బిహార్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సంచలన వ్యాఖ్యలకు మారుపేరుగా మారిన ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ మరోసారి రాజకీయ దుమారానికి తెరలేపారు. ఒకవైపు ఎన్డీఏ సారథి అయిన భారతీయ జనతా పార్టీపై పరోక్షం గా విమర్శలు చేసిన మాంఝీ, మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వీ యాదవ్ బిహార్ భవిష్యత్తు అని అభివర్ణించారు.