ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యున్నత స్థాయి సమీక్ష.

 


పీఆర్‌సీ నివేదిక, ఉద్యోగుల పదోన్నతులపై అత్యున్నత స్థాయి సమీక్ష చేయబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసు పెంపుపైనా ఇవాళే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశాలపై సమీక్ష జరుగనుంది. అయితే పీఆర్‌సీ నివేదికను సీఎస్ సోమేష్‌కుమార్ సీఎం కేసీఆర్‌కు అందిస్తారు‌. దానిపై చర్చిస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్. అన్ని శాఖల్లో పదోన్నతికి అర్హత ఉన్నటువంటివారికి ప్రమోషన్ ఇవ్వాలని సోమవారం సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పీఆర్ సీ ఎంత శాతం ఇస్తే బాగుంటుంది అనే అంశంపై అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అయితే నివేదిక ఆదారంగా సీఎం కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకుంటారు. అధికారుల నివేదిక కంటే ఎక్కువగా పీఆర్‌సీ ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. దీనితోపాటు ఎల్‌ఆర్ఎస్ కూడా కొంత సందిగ్ధత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మంది ఎల్ఆర్ఎస్ కట్టారు. అయితే వారికి అనుమతి ఇవ్వాల.. లేక రద్దు చేయాలా అనే దానిపై కూడా ముఖ్యమంత్రి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రెండు అంశాలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సోమవారం వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం జరిగింది. ఇందులో ప్రమోషన్లతో పాటు కారుణ్య నియోమకాల ప్రక్రియను ఎటువంటి జాప్యం లేకుండా పూర్తిచేయాలన్నారు. ప్రమోషన్లు ఇవ్వడం వల్ల వచ్చే ఖాళీలను కూడా ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్లలో చేర్చాలని ఆదేశించారు. ప్రయమోషన్లు, కారుణ్య నియామకాలు, డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టుల భర్తీ అంశాలపై ప్రతి వారంలో బుధవారం సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజన్‌ ప్రకారం అన్ని శాఖల కార్యదర్శులు , హెచ్‌ఓడీలు ఈ అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.