‘శాకుంతలం’ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్.

 


ప్రముఖ దర్శకనిర్మాత గుణశేఖర్ తాజాగా నిర్మిస్తోన్న పౌరాణిక సినిమా ‘శాకుంతలం’. పౌరాణిక కథాంశంతో లేడి ఓరియెంటెడ్‏గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే, ఇప్పటికే ఈ సినిమా గురించి ప్రకటన చేసిన దర్శకుడు గుణశేఖర్ ఈ మూవీలో లీడ్ రోల్ చేస్తున్నదెవరో ఇప్పటివరకూ ప్రకటించలేదు. అయితే, అనుకున్నట్టుగానే కావ్యనాయకిగా సమంతను ఎంచుకున్నాడు గుణ. ఇదే విషయాన్ని ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి ఇవాళ రివీల్ చేశాడు. మహాభారతంలోని ఓ ఘట్టం అధారంగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు గుణశేఖర్. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ మొదలుకాగా, ఈ ఏడాది చివరలో సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. శాకుంతలం సినిమా ద్వారా సమంత అక్కినేనికి ఇదే మొదటి పౌరాణిక పాత్ర కాబోతోందన్నమాట.