గోదావరి బొగ్గు గనుల్లో ప్రభాస్ సాలార్‌' షూటింగ్



 ప్రముఖ సినీ నటు డు ప్రభాస్‌ నటిస్తున్న నూతన సినిమా 'సాలార్‌'లోని ఓ ఫైటింగ్‌ సన్నివేశాన్ని రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో చిత్రీకరించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలోని ఓ సన్నివేశం చిత్రీకరణ కోసం పది రోజుల పాటు రామగుండం పరిధిలోని సింగరేణి ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులను ఎంచుకున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం కల్లా చిత్ర యూనిట్‌ సభ్యులు ఆర్జీ 3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు వద్దకు చేరుకొని సెట్టింగ్‌ పనులు ప్రారంభించారు. చిత్ర యూనిట్‌ సభ్యులకు సింగరేణి అతిథి గృహాలను కేటాయించినట్లు తెలిసింది. కాగా, రెండు, మూడు రోజుల్లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.