సింగరేణి లో ఉద్యోగాలు........

 


సింగరేణిలో మార్చిలో వివిధ విభాగాల్లో 651 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సంస్థ సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. ఈ మేరకు 569 కార్మికులు, 82 అధికారుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే 1,435 సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైన మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని, అలాంటి వారి బారిన పడి మోసపోవద్దని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 13,934 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సీఎండీ వెల్లడించారు.