నాచురల్ స్టార్ నానీ వరుస సినిమాలు చేస్తూ జోరు

 


నాచురల్ స్టార్ నానీ వరుస సినిమాలు చేస్తూ జోరు చూపిస్తున్నాడు. వీ అనుకున్నంతగా రాణించకపోయిన డీలీ పడకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. నాని తాజా చిత్రం టక్ జగదీష్ విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాను ఏప్రిల్16న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా కాస్త ఆలస్యంగా వచ్చేందుకు ఆస్కారాలు కనిపిస్తున్నాయి. దీని తరువాత నానీ చేస్తున్న సినిమా అంటే శ్యామ్ సింగరాయ్ ఈ సినిమా దాదాపు పూర్తయిపోయింది. త్వరలోనే శ్యామ్ సింగరాయ్ బరిలోకి దిగే డేట్ ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక నానీ తాజాగా నటిస్తున్న సినిమా అంటే సుందరానికి. ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా అలరించనున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. దీంతో పాటుగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కామెడీకీ ఢోకానే ఉండదని, అది కూడా ఎంతో కొత్త తరహాలో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని కామెడీ పాక్‌గా చెప్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో మలయాళీ బ్యూటీ నజ్రియా నాజిం హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతోనే అందాల ముద్దుగుమ్మ నజ్రియా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.