ఇంజనీరింగ్ పాసైన నిరుద్యోగ అభ్యర్థులకు అదిరిపోయే శుభవార్త

 


ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ హెచ్‌సీఎల్‌ ఇంజనీరింగ్ పాసైన నిరుద్యోగ అభ్యర్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. విజయవాడలోని హెచ్‌సీఎల్‌ క్యాంపస్ లో 1000 ఐటీ ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. హెచ్‌సీఎల్‌ న్యూ విస్టాస్‌ కార్యక్రమంలో భాగంగా వర్చువల్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ తో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. Also Read: నిరుద్యోగులకు ఆర్బీఐ శుభవార్త.. రూ.83 వేల వేతనంతో ఉద్యోగాలు..?


హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీమతి శివశంకర్‌ ఈ విషయాలను వెల్లడించారు. https://www.hcltech.com/careers/vijayawada వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం విజయవాడ హెచ్‌సీఎల్ క్యాంపస్ లో 1,500 మంది ఐటీ ఉద్యోగులు పని చేస్తుండగా రాబోయే నాలుగు సంవత్సరాలలో ఉద్యోగుల సంఖ్యను 5,000కు పెంచనున్నట్టు సమాచారం.


Also Read: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు ఎప్పటినుంచంటే..?


ఫిబ్రవరి 12, 13వ తేదీలలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ జరుగుతుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి నెల 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనుభవం ఉన్న అభ్యర్థులకు చిప్‌ డిజైనింగ్, డాట్‌నెట్‌, జావా ఇతర అంశాలపై పరీక్షలు నిర్వహిస్తారు.


మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు


వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగనుండటంతో ప్రతిభ ఉన్న అభ్యర్థులు సులభంగా ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయి.