కడప జిల్లాలో "వైయస్ఆర్ జగనన్న "ఇళ్ల పట్టాల పంపిణీ.

 


వైయస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కడప జిల్లాలో అట్టహాసంగా జరిగింది. కడప నగర శివారులోని సీకే దీన్నే మండలం కోప్పర్తిలో ఒక వేడుకలా నిర్వహించారు. పథకంలో భాగంగా కడప నగరంలోని 6 డివిజన్ల పరిధిలో దాదాపు 3066 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎం అంజద్ బాష, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి సతీమణి అరుణమ్మ తరపున మహిళలకు పసుపు, కుంకుమ అందజేశారు. నవరత్నాలలో భాగంగా చేపట్టిన పేదలందరికి ఇళ్లు పథకం దేశానికే ఆదర్శనీయమని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. గత పాలకుల మాటలు చెప్పి పబ్బం గడుపుకున్నారే తప్ప, చెప్పిన పనులన్నీ చేసి చూపించే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా నేతలు వ్యాఖ్యానించారు.