దేశ రాజధాని ఢిల్లీ ఉత్తమ్‌నగర్‌ రాజాపురి రోడ్‌లోని ఘోర అగ్ని ప్రమాదం

 


దేశ రాజధాని ఢిల్లీ ఉత్తమ్‌నగర్‌ రాజాపురి రోడ్‌లోని ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆటోమొబైల్‌ సర్వీస్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు.. 15 ఫైరింజన్లను తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తోనే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.