ఆస్కార్ అవార్డ్ రేసులో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్‌

 2021 ఏడాదికిగానూ బెస్ట్‌ షార్ట్‌ ఫిలిం క్యాటగిరి ఆస్కార్ అవార్డ్ రేసులో ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ నిర్మించిన 'నట్‌కట్‌' నిలిచింది. ఈ ఈ షార్ట్‌ ఫిలిం సినిమాలో విద్యాబాలన్‌ తల్లిపాత్రలో నటించగా, నిర్మాతగాను పరిచయం అయ్యారు. 2021 షార్ట్ ఫిలిం ఆస్కార్‌ అవార్డ్‌ రేసులో నిలవడంపై నిర్మాణ సంస్థ ఆర్‌ఎస్‌వీపీ, విద్యాబాలన్‌ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఈ షార్ట్ ఫిల్మ్ కోసం ఎంచుకున్న కాన్సెప్ట్ అద్భుతం. ఆడవారిని ఎలా గౌరవించాలి అనే విషయాన్ని చెప్పిన తీరు చాలా బాగుంది. చుట్టూ ఉండే పరిసరాలు పిల్లలలో చెడు ప్రవర్తన ఏర్పడడానికి ఎలా కారణం అవుతున్నాయనేది చక్కగా వివరించారు. లింగ బేదం, సమానత్వం, మహిళలపై చిన్న చూపు అంశాలతో షార్ట్‌ ఫిలిం రూపొందిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది.