క్రికెట్ లో కి సచిన్ వారసుడు

 


సచిన్‌ టెండ్కూలర్‌ కుమారుడు అర్జున్‌ టెండ్కూలర్‌ ముంబై సీనియర్‌ జట్టులో అరంగేట్రం చేశాడు. 21 ఏళ్ల అర్జున్‌ తొలిసారి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. శుక్రవారం హరియాణాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై 19.3 ఓవర్లలో 143 రన్స్‌కు ఆలౌటైంది. పదో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన అర్జున్‌ (0 నాటౌట్‌) పరుగులేమీ చేయలేదు. హరియాణా 17.4 ఓవర్లలో 144/2 స్కోరు చేసి 8 వికెట్లతో నెగ్గింది. బౌలింగ్‌లోనూ పెద్దగా ఆకట్టుకోని లెఫ్టామ్‌ పేసర్‌ అర్జున్‌ (1/34) ఒక వికెటే తీశాడు.