సేమ్ సీన్ రిపీట్ మరోసారి ఎటూ తేలని కేంద్రం-రైతుల మధ్య చర్చలు.

 


నేడు విజ్ఞాన్ భవన్‌లో కేంద్రం-రైతుల మధ్య జరిగిన 8వ విడత చర్చలు కూడా అసంతృప్తిగానే ముగిశాయి. అటు రైతులు చట్టాలు రద్దు చేయాలని పట్టుబడుతుంటే.. రద్దు తప్ప మరే ప్రతిపాదనకు అయినా కూడా తాము సిద్దమేనని కేంద్రం తమ వైఖరిపై కట్టుబడి ఉంది. కొత్త వ్యవసాయ చట్టాలను రైతులు అర్ధం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక రైతు సంఘాలు, కేంద్రం పట్టువీడకపోవడంతో.. ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. జనవరి 15వ తేదీన మరోసారి చర్చలు జరిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, కేంద్రం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. విజ్ఞాన్ భవన్ వద్ద కర్షకులు ‘మరణమో లేదా విజయమో’, ‘చట్టాలు రద్దయితేనే ఇంటికి’ నినాదాలతోప్లకార్డులను ప్రదర్శించారు.