బాలకృష్ణ, బోయపాటి కాంబో ...భారీ అంచన

 


బాలకృష్ణ, బోయపాటి కాంబో అంటేనే తెలుగు ఇంస్ట్రీలో సంచలనాల కాంబోగా పేరు తెచ్చుకుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు కూడా రికార్డులు సృష్టించాయి. ప్రస్తుతం వీరి కాంబోలో మూడో సినిమా రానుండటంతో ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మిరియాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. బాలకృష్ణతో తలపడేందుకు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం ప్రతి హీరో తమతమ సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. కానీ బాలయ్య సినిమా గురించి ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సరికొత్త అప్‌డేట్ రానుందని నిర్మాణ సంస్థ ద్వారక క్రియేషన్స్ వారు తెలిపారు. ఈ వార్తతో అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అయింది. ఈ సినిమాలో తమ అభిమాను హీరో లుక్స్ ఎలా ఉంటాయిని వారు వేచి చూస్తున్నారు. మరి రానున్న అప్‌డేట్ ఏంటని వేచి చూడాలి.