ఆంధ్రప్రదేశ్ లో వివాదాస్పదంగా మారుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం.

 


ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం రోజురోజుకీ మరింత వివాదాస్పదంగా మారుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడాన్ని జగన్ సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. ఎన్నికలు ఆపాలంటూ ఈ రోజు కోర్టుకు వెళ్లేందుకు కూడా ఏపీ సర్కారు సమాయత్తమైంది. కోర్ట్ కు సెలవులు ఉన్న నేపథ్యంలో హౌస్ మోషన్ మూవ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా లేమని చెప్పినా.. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూరహంకాపురితంగా వ్యవహరిస్తున్నారని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీంతో బాల్ హైకోర్టుకు చేరినట్లైంది..