నేటి నుంచి పంచాయతీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తొలి విడత నామినేషన్ల స్వీకరణ

 నేటి నుంచి పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇక ఈ నెల 31వ తేదీతో నామినేషన్ల స్వీకరణ ముగియనున్నది. వచ్చే నెల 9వ తేదీన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది ఆ తరువాత కౌంటింగ్ జరగనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ మొదటి విడత ఎన్నికల్లో విజయనగరం జిల్లా మినహా 12 జిల్లాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 12 జిల్లాల్లోని 18 డివిజన్ల పరిధిలోని 168 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో జిల్లాల్లోని ఈ డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి.  శ్రీకాకుళం జిల్లా: డివిజన్లు: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ, మండలాలు: 10, విశాఖ జిల్లా: డివిజన్: అనకాపల్లి మండలాలు: 12, తూ.గో. జిల్లా: డివిజన్లు: కాకినాడ, పెద్దాపురం. మండలాలు: 20, ప.గో జిల్లా: డివిజన్: నర్సాపురం, మండలాలు: 12 , కృష్ణా జిల్లా: డివిజన్: విజయవాడ, మండలాలు: 14, గుంటూరు జిల్లా: డివిజన్: తెనాలి, మండలాలు: 18, ప్రకాశం జిల్లా: డివిజన్: ఒంగోలు, మండలాలు: 15, నెల్లూరు జిల్లా: డివిజన్: కావలి డివిజన్‌ మండలాలు: 9, కర్నూలు జిల్లా: డివిజన్: నంద్యాల, కర్నూలు మండలాలు: 12, అనంతపురం జిల్లా: డివిజన్: కదిరి, మండలాలు: 12, కడప జిల్లా : డివిజన్లు: కడప, జమ్మలమడుగు, రాజంపేట మండలాలు: 14, చిత్తూరు జిల్లా: డివిజన్: చిత్తూరు. మండలాలు: 20.a