పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్....

 


పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. ఇది హిందీ హిట్ మూవీ ‘పింక్’కు తెలుగు రీమేక్. సంక్రాంతి కానుకగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేస్తామని చెప్పిన చిత్ర యూనిట్.. తాజాగా దానికి సంబంధించిన అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌కు పండగ లాంటి వార్తను ఇచ్చింది. సంక్రాంతి కానుక‌గా జనవరి 14న సాయంత్రం 6 గంటల 03 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంటూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. కాగా, ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. 2020లో ట్విట్టర్‌లో ‘వకీల్ సాబ్’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయిన దాని బట్టే సినిమా టీజర్ కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో అర్ధమైపోతుంది.