నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీకి పయనం

 


నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రు
లను కలవనున్నారు. పోలవరం పెండింగ్ నిధులు, హైకోర్టు తరలింపు తదితర అంశాలపై కేంద్ర మంత్రులతో జగన్ చర్చించే అవకాశం ఉంది. అయితే, రాష్ట్రంలో దేవాలయాల విధ్వంసాలు, అంతర్వేదిలో రథం దగ్ధం కేసుపై నాలుగు నెలలుగా సీబీఐ దర్యాప్తు చేపట్టకపోవడం, గుళ్లపై దాడుల విషయమై టీడీపీ, బీజేపీ నేతలు.. వైసీపీని బోనెక్కిస్తున్న దశలో తలపెట్టిన ఈ పర్యటన రాజకీయ ప్రాధాన్యతని సంతరించుకొంది. ఢిల్లీకి చేరుకోగానే ముందుగా హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యేందుకు ముఖ్యమంత్రి జగన్‌ ఆసక్తి చూపుతుండటం ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలను అమిత్‌షాకు జగన్‌ వివరిస్తారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.