ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం సమావేశం.

 


ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం సమావేశం అయ్యింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, పంచాయితీ రాజ్ ప్రిన్సిపుల్ సెక్రటరీ గోపాల్ కృష్ణ ద్వివేది, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ఎన్నికల కమిషనర్‌ను కలిసినవారిలో ఉన్నారు. పంచాయితీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించాలని కమిషన్ ప్రొసీడింగ్స్ ఇచ్చింది. దీనిపై కీలక భేటీ జరుగుతోంది. హైకోర్టు సూచించిన మేరకు… సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అశోక్‌కుమార్‌ సింఘాల్‌, పంచాయతీ రాజ్‌శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది… రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చిస్తున్నారు. ఫిబ్రవరిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు జరపాలని నిమ్మగడ్డ ప్లాన్‌ చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీలో ఎలాంటి నిర్ణయానికి వస్తారన్నది ఆసక్తిగా మారింది.