భారత్ ఆస్ట్రేలియా మధ్య ముగిసిన రెండో రోజు ఆట.

 


భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ సిడ్నీ వేదికగా జరుగుతుంది. 166/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా 338 పరుగుల చేసింది. స్పిన్నర్‌ రవీంద్ర జడేజా చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. జడేజా 4, బుమ్రా, సైని 2, సిరాజ్ 1 వికెట్‌ తీశారు. ఆతర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతూ మంచి ప్రదర్శన కనబరిచింది. శుక్రవారం ఆట నిలిచిపోయే సమయానికి భారత్‌ 45 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. 70 పరుగుల వద్ద రోహిత్ శర్మ (26) పరుగులకు వెనుదిరిగాడు. 85 పరుగుల దగ్గర శుభ్‌మన్‌గిల్ 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో పుజారా (9), రహానే (5) ఉన్నారు. టీమిండియా ఇంకా 242 పరుగుల వెనుకంజలో ఉంది