ఆంధ్ర ప్రదేశ్ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం

 

ఆంధ్ర ప్రదేశ్ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్మిషన్లను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలని ఫిక్స్ అయ్యింది. దీని ప్రకారం.. గతంలో మాదిరిగానే ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు జరగనున్నాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ను ఇంటర్ బోర్డు మరో రెండు రోజుల్లో విడుదల చేయనుంది. కాగా, విద్యార్థుల సన్నద్ధత లేకుండా ఆన్‌లైన్ విధానంలో అడ్మిషన్లు చేపట్టాలన్న ఇంటర్ బోర్డు నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది. దాంతో ఇంటర్ బోర్డు అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు అడ్మిషన్లు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. కాగా, కరోనా కారణంగా ఈ ఏడాది అడ్మిషన్లు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.