కాకతీయయూనివర్సిటీ దూర విద్య కేంద్రం పీజీపరీక్షల టైమ్ టేబుల్ విడుదల.

 


కాకతీయయూనివర్సిటీ దూర విద్య కేంద్రం పీజీ, బీఎల్‌ఐఎస్సీ, ఎంబీఏ (డిస్టెన్స్‌) కోర్సుల పరీక్షలు జనవరి 20 నుంచి నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్‌ మహేందర్‌రెడ్డి, దూర విద్య కేంద్రం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వీరన్న, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ వెంకయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఎస్సీ, మ్యాథమెటిక్స్‌, ఎంఏ తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, ఉర్దూ, సంస్కృతం, పబ్లిక్‌ అ్మడినిస్ట్రేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, ఎకనామిక్స్‌, హిస్టరీ, ఎంకాం, హెచ్‌ఆర్‌ఎం, రూరల్‌ డెవలప్‌మెంట్‌, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల ఫైనల్‌ పరీక్షలు జనవరి 20, 22,24, 27, 29 తేదీల్లో , అలాగే మొదటి సంవత్సరం పరీక్షలు జనవరి 21,23,25,30 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎంఎస్సీ ఇన్విరాన్‌మెంట్‌ సైన్స్‌ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు జనవరి 28,30, ఫిబ్రవరి 1,3,5,7,9 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. బీఎల్‌ఎస్సీ పరీక్షలు జనవరి 27,28,29,30,31, ఫిబ్రవరి 1,2 తేదీల్లో థియరీ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు జరుగుతాయన్నారు. సీఎల్‌ఐఎస్సీ పరీక్షలు జనవరి 27,28,29,30,31 తేదీల్లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు థియరీ పరీక్షలు, ఫిబ్రవరిలో ప్రాక్టీకల్స్‌ ఉంటాయని అన్నారు. మరిన్ని వివరాల కోసం దూరవిద్య కేంద్రం వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అన్నారు.