ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఇష్యూ

 


ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఇష్యూతో సిగ్నల్ కు ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. వాట్సాప్ యూజర్లంతా సిగ్నల్ కు స్విచ్ అయిపోతున్నారు. వాట్సాప్ ప్రైవసీ వివాదాస్పదం కావడంతో సిగ్నల్ యాప్ కు యూజర్ల నుంచి అపూర్వమైన స్పందన వస్తోంది. సిగ్నల్ కూడా వాట్సాప్ మాదిరిగానే ఎన్ క్రిప్టెడ్ మెసేంజర్ యాప్.. టెలిగ్రామ్ యాప్ కూడా అదే స్థాయిలో యూజర్ల నుంచి రెస్పాన్స్ వస్తోంది. వాట్సాప్ యూజర్లు తమ డేటాను ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తో షేర్ చేసుకోవాలంటూ నోటిఫికేషన్లు పంపిస్తోంది. ఫిబ్రవరి 8లోగా వాట్సాప్ యూజర్లు ప్రైవసీ పాలసీని యాక్సప్ట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే వాట్సాప్ యాప్ పనిచేయదు.  దాంతో వాట్సాప్ యూజర్లంతా సిగ్నల్ యాప్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే సిగ్నల్ యాప్ కు మిలియన్ల మంది యూజర్లు డౌన్ లోడ్ చేసుకోగా.. స్వదేశీ యాప్ టెలిగ్రామ్ కూడా ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల యాక్టివ్ యూజర్లు పెరిగారు. వాట్సాప్‌ను ఫేస్‌బుక్‌కు విక్రయించడానికి ముందు సహా వ్యవస్థాపకులుగా ఉన్న బ్రియాన్ ఆక్టన్.. ఇప్పుడు సిగ్నల్ ఫౌండేషన్‌కు సహ-వ్యవస్థాపకుడిగా ఉన్నారు. అయితే సిగ్నల్‌కు సమానమైన డేటాను ఇవ్వడానికి నిరాకరించారు. గతవారంలో సిగ్నల్ యాప్ కు యాక్టివ్ యూజర్ల సంఖ్య భారీగా పెరిగిందని ఆయన తెలిపారు.  సిగ్నల్ యాప్.. వీడియో గ్రూప్ చాట్ ఫంక్షన్లను మెరుగుపరచడానికి కృషి చేస్తోందని చెప్పారు. గత ఏడాదిలో వాట్సాప్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఇతర కాన్ఫరెన్సింగ్ యాప్ లతో పోటీ పడటానికి వీలు కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడు రోజులలో సిగ్నల్ 17.8 మిలియన్ల వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. మునుపటి వారం కంటే 62 రెట్లు పెరిగింది.  అదే సమయంలో 17శాతం మేర క్షీణతతో 10.6 మిలియన్ల యూజర్లు వాట్సాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ యాప్‌ను సిలికాన్ వ్యాలీలో సిగ్నల్ ఫౌండేషన్, ఫిబ్రవరి 2018లో ఆక్టాన్ ప్రారంభించింది. యాప్ ద్వారా 50 మిలియన్ల ప్రారంభ నిధులు సమకూరాయి. ఈ యాప్ విరాళాల ఆధారంగా రన్ అవుతోంది. లక్షలాది యూజర్ల ప్రైవసీ గోప్యతనే ప్రాధాన్యతగా కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.