ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం.

 


పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసే దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పట్టణ, నగర పేదలకు తక్కువ ధరలకు ప్లాట్లు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వమే లే-అవుట్లను అభివృద్ధి చేస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. లాభాపేక్ష లేకుండా లాటరీ పద్దతిలో లబ్దిదారులకు ప్లాట్లను కేటాయిస్తామన్నారు. మధ్యతరగతి ప్రజలకు కూడా సొంత స్థలం, వివాదాల్లేని ప్లాట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. దీనికోసం అధికారులు మేధోమధనం చేసి ఓ సరికొత్త విధానాన్ని రూపొందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.