రోజురోజుకు గణనీయంగా పడిపోతుంది ఉష్ణోగ్రతలు.

 


తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో చలి విపరీతంగా పెరిగింది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో చలి గాలుల తీవ్రత అధికమవుతోంది. దాంతో చలి పంజా విసురుతోంది. ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు ప్రభావం అధికంగా ఉంటోంది. దాంతో ఎదురుగా ఎవరున్నరనేది కూడా తెలియడం లేదు. ఇక రోడ్లపై వాహనదారులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా ఏమున్నదో కనిపించక అవస్థలు పడుతున్నారు. అయితే, మరికొన్ని రోజుల వరకు నగరంలో ఇదే పరిస్థితి ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సోమవారం నాడు నగరంలో 16.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రానున్న రెండు మూడు రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీలు పడేపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక నగరంలోని శివారు ప్రాంతాల్లో అయితే దారుణమైన ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రామచంద్రాపురంలో అత్యల్పంగా 12.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాజేంద్ర నగర్‌లో 12.4, ఉప్పల్ 13.1, ఎల్బీనగర్ 14.8 చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.