మహిళా ప్రయాణికుల కోసం ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.

 


మహిళల కోసం ఏపీఎస్ఆర్టీసీ వినూత్న నిర్ణయం తీసుకుంది. దూర ప్రాంతాలు వెళ్లేవారి కోసం ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ఆర్టీసీ ఎంపిక చేసిన రూట్లలోనే ఈ బస్సులు నడవనున్నాయి. తొలుత విజయవాడ-హైదరాబాద్ మధ్య మహిళల కోసం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును అధికారులు ప్రయోగాత్మకంగా నడపనున్నారు. ఈ బస్సు ప్రతీ శుక్రవారం రాత్రి 11.58 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరుతుంది. అలాగే ప్రతీ ఆదివారం రాత్రి 10.20 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య ఉంటుంది. కాగా, ఈ బస్సుకు ముందుగా రిజర్వేషన్ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పిస్తోంది.