గోదుమల వినియోగం వల్ల బహు ప్రయోజనాలు

 


మన నిత్య జీవితంలో బియ్యం తర్వాత గోధుమ ని ఆహారంలో ఎక్కువగా వినియోగిస్తున్నాం. ఉత్తర భారత దేశంలో గోధుమ ని విస్తారంగా సాగు చేస్తున్నారు, మరియు గోధుమ పిండితో చేసిన రొట్టెలు, చపాతీలు వారి ప్రధాన ఆహారం .గోధుమలను పులియబెట్టడం ద్వారా బీరు, ఆల్కహాలు మొదలైన వాటిని తయారు చేయవచ్చు. గోధుమ ధాన్యం లో అత్యధికంగా ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం, వంటి అనేక పోషక విలువలు ఉన్నాయి . కనుక ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో గోధుమ ఆహారం ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల ఏ వ్యాధి మన దరికి చేరదు.


అయితే మార్కెట్లో దొరికే రిఫైన్డ్ గోధుమపిండి వాడడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. రిఫైన్డ్ గోధుమపిండికన్నా గోధుమలను మరాడించిన పూర్తి గోధుమ పిండి (whole grain wheat ) ఆరోగ్యానికి మంచిదని, బరువు తగ్గటానికి మనం స్వంతంగా మరపట్టించుకున్న గోధుమ పిండి (whole grain wheat )నే వాఢుకోవాలని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ధాన్యం గోధుమ గుండె జబ్బు , షుగరు వ్యాధి,గాల్‌స్టోన్, ఉబ్బరం లాంటి జీర్ణకోశ వ్యాధులు కూడా తగ్గుతాయి.గోధుమపిండి ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచి రొమ్ము కేన్సర్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.వరికన్నా గోధుమ పిండికి ఎక్కువ ప్రాధాన్యత నివ్వటం అవసరమే అని అని కొందరు వైద్యులు సూచిస్తున్నారు.


గోధుమల్లో ఉండే గ్లూటెన్ అనే పదార్థం కొంతమందికి సరిపడక అనేక జీర్ణకోశ సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.అలాంటి అలర్జీ ఉన్న వాళ్ళు గోధుమలు ఆహారంలో తక్కువ తీసుకోవడం మంచిది. గోధుమలు రెండు రకాలు.రవ్వ గోధుమలూ, పిండి గోధుమలూ ఇందులో ఎక్కువ మనం పిండి గోధుమ ఉపయోగిస్తాం కానీ మన ఆరోగ్యానికి రవ్వ గోధుమ శ్రేయస్కరం. రవ్వ గోధుమల్లో ప్రొటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. గ్లుటెన్ పదార్థం తక్కువగా ఉంటుంది. రవ్వ గోధుమలు ఖరీదైన అప్పటికే వీటిని వాడటం మంచిది. గోధుమ ధాన్యం ఆరోగ్య ఖజానా అని అందుకే అంటారు.