వాట్సాప్ నుండి కొత్త అప్డేట్.

 


గతంలో చెప్పినట్లుగానే ప్రముఖ మేసెజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు కొత్త అప్‏డేట్‏ను తీసుకువచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వాడే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. దీంతో తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త అప్‏డేట్లను పరిచయం చేస్తూ ఉంటుంది. ఇక గతంలో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఫీచర్‍ను తీసుకురానున్నట్లుగా తన బ్లాగ్‏లో వాబీటా ఇన్ఫోలో ప్రకటించింది. న్యూఇయర్ నుంచి ఈ అప్‏డేట్‏ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇక వాట్సాప్ తీసుకువచ్చిన కొత్త అలర్ట్ ఎంటంటే.. టర్మ్స్ అండ్ కండీషన్స్ రూల్స్‏ని ప్రతిఒక్కరు అంగీకరించాల్సి ఉంటుంది. ఎవరైతే వాటిని అంగీకరించలేదో.. వారి ఫోన్లలో 2021 ఫిబ్రవరి 8 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని తెలిపింది. ఈ టర్మ్స్ అండ్ కండీషన్స్ అలర్ట్‏ను దశల వారిగా తమ యూజర్లకు షేర్ చేయనున్నట్లుగా తెలిపింది. ఇక కొత్త సంవత్సరం ప్రారంభమైన నుంచి చాలా వరకు ఈ కొత్త అప్‏డేట్ అలర్ట్‏ను పొందుతున్నారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ తమ సన్నిహితులకు తెలియజేస్తున్నారు. 2014లో ఫేస్‏బుక్ సంస్థ ఈ వాట్సాప్ సంస్థను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వినియోగదారుల గోప్యత గురించి వాట్సాప్ పై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. ఇందు కోసమే తమ యూజర్ల గోప్యత మరియు డేటా భద్రత గురించి వస్తున్న విమర్శల నేపథ్యంలో వాట్సాప్ సంస్థ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్‏డేట్‏ను తీసుకువచ్చినట్లుగా సమాచారం.