కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు ఎప్పటిలాగానే బస్‌పాస్‌లు

 

కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు ఎప్పటిలాగానే ఫ్రీ, రూట్‌, స్టూడెంట్‌ జనరల్‌, స్టూడెంట్‌ గ్రేటర్‌, స్టూడెంట్‌ స్పెషల్‌, స్టూడెంట్‌ ఎక్స్‌క్లూజివ్‌, డిస్ట్రిక్‌ బస్‌పాస్‌లను జారీ చేస్తున్నామని టీఎస్‌ ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్‌రావు సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఫిబ్రవరి 1నుంచి బస్‌పాస్‌ల జారీ మొదలవుతుందన్నారు. అడ్మినిస్ట్రేటివ్‌ చార్జీలు చెల్లించి బస్‌పాస్‌ కోడ్‌ పొందిన ప్రైవేట్‌ విద్యాసంస్థల విద్యార్థులకే బస్‌పాస్‌లను జారీ చేయనున్నామని స్పష్టం చేశారు. బస్‌పాస్‌లను పొందే విద్యార్థులు తమ విద్యాసంస్థ బస్‌పాస్‌ కోడ్‌తో సహా, నిర్దేశిత పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నిర్దేశిత బస్‌పాస్‌ కేంద్రంలో పాస్‌ను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.


అఫ్జల్‌గంజ్‌, ఆరాంఘర్‌, బాలానగర్‌, షాపూర్‌నగర్‌, సుచిత్ర, సీబీఎస్‌, చార్మినార్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఈసీఐఎల్‌ ఎక్స్‌ రోడ్‌, ఫారూఖ్‌నగర్‌, జీహెచ్‌ఎంసీ హెడ్‌ ఆఫీస్‌, ఘట్‌కేసర్‌, హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, జేబీఎస్‌, కాచిగూడ, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌, లింగంపల్లి, మేడ్చల్‌, మెహిదీపట్నం, మిథాని, మొయినాబాద్‌, ఎన్‌జీవో కాలనీ, పఠాన్‌చెరు, సికింద్రాబాద్‌, రిసాలా బజార్‌, సనత్‌నగర్‌, శంషాబాద్‌, తార్నాక, తుక్కుగూడ, ఉప్పల్‌, వనస్థలిపురం కేంద్రాలలో బస్‌పాస్‌లను పొందవచ్చని తెలిపారు.