నేడు జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి.నేడు జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మహ్మాతుడి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన వారిలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హోంమంత్రి మహముద్ అలీ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గాంధీ సేవలను స్మరించుకున్నారు.