ఆసీస్‌తో జరిగే ఆఖరి టెస్ట్ పై అనుమానాలు..

 


ఆసీస్‌తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌పై క్రీనీడలు కమ్ముకుంటున్నాయి. చివరి దశకు చేరుకున్న వేళ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బయోబబుల్​ ఆంక్షల ఉల్లంఘన ఆరోపణలపై పలువురు టీమిండియా ఆటగాళ్లను శనివారం ఐసోలేషన్​కు పంపారు. ఈ నేపథ్యంలో ఆఖరి టెస్టు జరగనున్న బ్రిస్బేన్​కు వెళ్లడానికి టీమిండియా సుముఖంగా లేదని తెలుస్తోంది. షెడ్యూల్​ ప్రకారం బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలోని చివరి టెస్టుకు బ్రిస్బేన్​లోని గబ్బా స్టేడియాన్ని వేదికగా నిర్ణయించారు.​ అయితే జనవరి 15 నుంచి 19 వరకు ఈ మ్యాచ్​ జరగనుంది. బ్రిస్బేన్​లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. కోవిడ్ ఆంక్షల వల్ల భారత క్రికెటర్లు మరోసారి లాక్​డౌన్​లో ఉండాల్సి వస్తే అది వారి ఆటపై దుష్ప్రభావం చూపుతుందని బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే రెండు టెస్టులు ఆడిన టీమిండియా, ఆసీస్​ చెరో గెలుపుతో సమానంగా ఉన్నా


యి. సిడ్నీ వేదికగా మూడో టెస్టు జనవరి 7న ప్రారంభంకానుంది