క్యూబాలో కుప్ప కూలిన హెలికాప్టర్.


క్యూబాలో ఓ హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. దీంతో ఐదుగురు మరణించారు. క్యూబాలోని హెూల్విన్ ప్రావిన్స్‌ నుంచి గ్వాంటనా
మో ద్వీపానికి వెళ్తుండగా ఒక కొండపై హెలికాప్టర్‌ ఒక్కసారిగా కూలిపోయిందని సాయుధ దళాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం పాలయ్యారని వెల్లడించింది. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలసుకోవడానికి దర్యాప్తునకు ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశామని తెలిపింది.