వైద్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ

 

త్వరలోనే వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. సోమవారం వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల యూనియన్‌(హెచ్‌-1) రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి సాయిరెడ్డి ఆధ్వర్యంలో ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను మర్యాద పూర్వకం గా కలిశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం యూనియన్‌ అధ్యక్షుడు సాయిరెడ్డి మాట్లాడుతూ వైద్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పదోన్నతులు తదితర సమస్యలను మంత్రి కేటీఆర్‌కు వివరించామన్నారు. ఈ విషయమై సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని కర్నాటి తెలిపారు. యూనియన్‌ ప్రతినిధులు యాదగిరి, రాజు, శ్రీనివాస్‌, బాలయ్య, రాజశేఖర్‌, ఎంపీహెచ్‌ఏ ప్రతినిధి కె.గోపాల్‌రావు పాల్గొన్నారు.