బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని సమాచారం తెలిసింది. దాదా ఆరోగ్యంపై దిగులుపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఈసీజీ) రిపోర్టులో స్వల్ప మార్పులు కనిపించాయని వైద్యులు తెలిపారు. రేపు డాక్టర్ దేవీ శర్మ నేతృత్వంలో రెండో స్టెంటు అమర్చనున్నట్లు ఉందని వుడ్ ల్యాండ్స్ ఆస్పత్రి యజమాన్యం తెలిపింది. ఇంతకుముందు గుండెనొప్పితో బాధపడిన సౌరవ్ గంగూలీ హృదయ రక్తనాళాల్లో మూడు పూడికలను గుర్తించారు. ఒకదాంట్లో స్టెంట్‌ను అమర్చారు. అనంతరం ఆరోగ్యంగానే ఉండటంతో.. రెండో స్టెంట్ వేయడాన్ని వాయిదా వేశారు. " బుధవారం ఉదయం దాదా అసౌకర్యంగా ఉన్నారని, ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. సీసీయూ 142 యూనిట్లో ఆయనను ఉంచి చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం దాదా ఆరోగ్యం నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. రేపు డాక్టర్ దేవీశర్మ ఆధ్వర్యంలో రెండో స్టెంట్ ను అమర్చనున్నాం " అని డాక్టర్లు తెలిపారు.
ఆస్పత్రి వర్గాల సమాచారం ప్రకారం సౌరవ్ గంగూలీ ఈసీజీ నివేదికలో స్వల్ప మార్పులు గుర్తించారని తెలిసింది. వైద్యులు దాదా ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దాదా ఆరోగ్యం విషమంగా ఏమీ లేదని ఆందోళన అక్కర్లేదని వారు తెలిపారు. యాంజియోప్లాస్టీపై నిర్ణయానికి ముందు మరోసారి దాదాను పరీక్షించనున్నారు.మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 7212 రన్స్, వన్డేల్లో 11363 పరుగులు చేశారు. మొత్తం 38 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ 59 మ్యాచ్‌లాడిన దాదా.. 106.81 స్ట్రైక్‌రేట్‌తో 1349 పరుగులు చేశారు. బౌలర్‌గానూ ఇంటర్నేషనల్ క్రికెట్లో 132 వికెట్లు, ఐపీఎల్ 10 వికెట్లని దాదా పడగొట్టారు. మీడియం పేస్ బౌలింగ్ దాదా ఆకట్టుకున్నారు.