ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ట్రాక్టర్ ర్యాలీ.


డీల్లీ సరిహద్దులు గురువారం ఎన్నడూ చూడని పరిస్థితిని చూశాయి. కార్గో ట్రక్కులతో నిండి ఉండే సుమారు 135 కి.మీ. దూరం 40 కి పైగా రైతు సంఘాలు నిర్వహించిన ట్రాక్టర్ ట్రాలీలతో నిండిపోయింది. . ఘజియాబాద్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పాల్వాల్ వరకు సాగింది. ఢిల్లీ, హర్యానా పోలీసుల మోహరింపు మధ్య ఉదయం 11 గంటలకు రైతులు తమ ట్రాక్టర్ మార్చ్ ను కుండ్లి -మానెసార్-పాల్వాల్ ఎక్స్ ప్రెస్ దిశగా సాగించారు. ఈ నెల 26 న రిపబ్లిక్ దినోత్సవం నాడు ట్రాక్టర్ పరేడ్ ని నిర్వహించాలని రైతు సంఘాలు ఇదివరకే నిర్ణయించాయి. ఆ రోజున ఒక్క హర్యానా నుంచే సుమారు 2,500 ట్రాక్టర్లు ఈ మార్చ్ లో పాల్గొంటాయని అంచనా. ఇక పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి కూడా అన్నదాతలు తమ ట్రాక్టర్లతో రానున్నారు.