మరోసారి కాల్పులకు తెగబడిన పాకిస్తాన్...

 


జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని నౌషెరా సెక్టార్‌ నియంత్రణ రేఖ మీదుగా పాకిస్తాన్ దళాలు భారత సైన్యంపై కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో సుబేదార్ రవీందర్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందతూ మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. కాగా రవీందర్ నిజాయితీ గల జవాన్ అని అతనికి, అతడి కుటుంబానికి దేశం ఎల్లప్పుడు రుణపడి ఉంటుందని ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌లో ఇప్పటికరకు పాకిస్తాన్ 5,100 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘించిందని,18 ఏళ్లలో రోజుకు సగటున 14 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు భారత దళాలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయని హెచ్చరించారు. ఈ కాల్పుల విరమణలో ఇప్పటి వరకు 24 మంది భద్రతా సిబ్బందితో సహా 36 మంది మృతి చెందగా,130 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. పాకిస్తాన్ దళాలు సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను భయ బ్రాంతులకు గురిచేయడానికి, శాంతి భద్రతలను నాశనం చేయడానికి పదే పదే కాల్పులు జరుపుతున్నాయని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.