త్వరలో వాట్సాప్ లో రాబోతున్న కొత్త రూల్స్....

 


మీరు వాట్సాప్‌ వాడుతున్నారా ? చాటింగ్‌ చేస్తున్నారా? అయితే బహుపరాక్‌ .. త్వరలో కొత్త రూల్స్‌ రాబోతున్నాయి. కొత్త వాట్సాప్‌ నిబంధలను మీరు అంగీకరిస్తేనే చాటింగ్‌ కొనసాగించే అవకాశం ఉంటుంది. ఆ రూల్స్‌ను అంగీకరించకపోతే మీ ఫోన్‌ నుంచి వాట్సాప్‌ ఫీచర్‌ అటోమేటిక్‌ మాయమవుతుందన్న సందేశాన్ని తరచుగా పంపిస్తున్నారు. అయితే దీనికి మీరు ఓకే అంటే మీ వ్యక్తిగత డేటా అంతా వాట్సాప్‌కు లీకయిపోతోంది. ఫిభ్రవరి 16 లోగా వాట్సాప్‌ వినియోగదారులంతా ఈ కండీషన్స్‌కు అంగీకరించాల్సిందే. ఆ తరువాత యాప్‌ అన్‌ఇన్‌స్టాల్‌ అయిపోతుంది. కొత్త నిబంధనల ప్రకారం మీ పర్సనల్‌ డేటాను వాట్సాప్‌ ఇతర ఫేస్‌బుక్‌ కంపెనీలతో షేర్‌ చేస్తుంది. 2014లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కుతూ ఈ విధానాన్ని ప్రవేశపెడుతోంది వాట్సాప్‌. మీ లొకేషన్‌ డేటా , ఐపీ అడ్రస్‌., టైమ్‌జోన్‌ , ఫోన్‌ మోడల్‌ , బ్యాటరీ లెవెల్‌ , సిగ్నల్‌ సామర్ధ్యం , బ్రౌజర్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌, ఐఎస్‌పీ, భాషను వాట్సాప్‌ గ్రూప్‌ కంపెనీలకు షేర్‌ చేస్తారు. అంతేకాదు స్టేటస్‌ ఫోటో, మెసేజ్‌లు, కాల్స్‌, మీరు ఫోన్లు చేసే నెంబర్లు, ప్రొఫైల్‌ ఫోటో, ఆఖరిసారిగా ఎప్పుడు మీరు ఆన్‌లైన్‌లో ఉన్నారు తదితర విషయాలన్నీ తెలిసిపోతాయి. వాట్సాన్‌ కొత్త నిబంధనతో ఫేస్‌బుక్‌ కంపెనీలను చాలా డేటా షేర్‌ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా డేటా షేర్‌ అవుతున్నప్పటికి యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో మాత్రం ఇది సాధ్యం కాదు. ఎందుకంటే డేటా ప్రైవసీ విషయంలో ఈయూ దేశాలు చాలా కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. వాట్సాప్‌ కొత్త రూల్స్‌కు ఒప్పుకోకపోతే మీరు యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రైవసీకి భంగం కలిగించే విధంగా ఈ నిబంధనలు ఉన్నాయని వినియోగదారులు మండిపడుతున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవుతుండటంతో వాట్సప్ స్పందించింది. పారదర్శకంగా ఉండటానికి, బిజినెస్ ఫీచర్స్‌ను వివరించడానికి తమ ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేశామని వాట్సప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ తెలిపారు. . ఇది బిజినెస్ కమ్యూనికేషన్ మాత్రమేనని, డేటా షేరింగ్‌కి సంబంధించి ఎలాంటి మార్పులు లేవని, యూజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎప్పట్లాగే కమ్యూనికేషన్‌లో ఉండొచ్చని, వారిపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. వాట్సప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఎప్పట్లాగే ఉంటుందన్న వాట్సప్ హెడ్, యూజర్ల ప్రైవేట్ ఛాట్స్, లేదా కాల్స్‌ను రికార్డ్ చేయమని, ఫేస్‌బుక్‌‌కు కూడా ఈ డేటా లభించదన్నారు. ప్రైవసీ విషయంలో మేం పోటీలో ఉన్నామని, ఇది ప్రపంచానికి మంచిదని, ఇతరులతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలన్నదానిపై ప్రజలకు ఛాయిస్ ఉండాలని, వారి ఛాట్స్‌ని ఎవరూ చూడట్లేదన్న నమ్మకం ఉండాలని అన్నారు.