త్వరలో వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్..

 


ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక యూజర్లను కలిగిన మేసెజింగ్ సంస్థ వాట్సాప్. తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‏ను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. తాజాగా వాట్సాప్ మల్టీ డివైస్ సపోర్ట్‏పై పనిచేసేలా త్వరలో మరో ఫీచర్ రానున్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని వార్తలు వచ్చినా.. ఇంతవరకు ఇది అందరి ఫోన్లలోకి రాలేదు. తాజా సమచారం ప్రకారం.. మీ ఫోన్లో ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా వాట్సాప్ వెబ్‏కు కనెక్ట్ అయ్యే ఫీచర్‏ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. వినియోగదారుని ఫోన్‏లో ఇంటర్నెట్ లేకపోయినా.. వాట్సప్ వెబ్ సెషన్ ద్వారా ఇంటర్నెట్‏కు కనెక్ట్ అవ్వచు. ఈ ఫీచర్‏ను ముందుగా wabetainfo గుర్తించింది. దీని ప్రకారం.. వాట్సాప్ వెబ్ ఉపయోగించేటప్పుడు సడెన్‏గా మీ ఫోన్‏కు ఇంటర్నెట్ డిస్ కనెక్ట్ అయితే.. వాట్సాప్ వెబ్ సెషన్ కూడా ఆగిపోతుంది. కానీ త్వరలో వచ్చే ఈ ఫీచర్‏తో వాట్సాప్ వెబ్ ఆగిపోకుండా ఉండనుంది. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలోనే మిగతా యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. ఇక దీంతోపాటు మల్టీ డివైస్ ఫీచర్ ద్వారా ఒకేసారి నాలుగు డివైస్‏లకు కనెక్ట్ చేయవచ్చని wabetainfo తెలిపింది. డెస్క్ టాప్, వెబ్ యాప్, మరో ఫోన్.. ఇలా ఏ డివైస్‏కు అయినా వాట్సాప్ కనెక్ట్ చేస్తే.. అందులోనే చాట్ హిస్టరీ మీరు కనెక్ట్ చేసిన డివైస్‏లలోకి ఆటోమేటిక్‏గా వెళ్ళిపోతుంది. ఇక వాట్సాప్ లింక్ చేసిన డివైస్‏లలో చాట్‏లను ఆర్కైవ్ చేయడం, మ్యూట్ చేయడం, డిలీట్ చేయడం వంటివి చేయడానికి కుదరు. ఏ ఫోన్లో అయితే ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేశారో అందులోనే ఇవి చేయడానికి వీలు ఉంటుంది.