భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ శ్రీలంక పర్యటన.

 


భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మంగళవారం శ్రీలంక పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షిక ప్రయోజనాల గురించి చర్చించనున్నట్లు విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత సంవత్సరం శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ్‌ రాజపక్స పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ శ్రీలంకను సందర్శించడం తొలిసారి. ఈ పర్యటనలో శ్రీకలం అధ్యక్షుడు గోటబాయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స, రాజకీయ వేత్తలు దినేష్‌ గుణవర్ధనేయతో జైశంకర్‌ భేటీ కానున్నారు. ఈ భేటీల్లో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కాగా, జైశంకర్‌ 2021లో శ్రీలంకను సందర్శించిన మొట్టమొదటి విదేశీ ప్రముఖుడయ్యాడు. మంత్రి జైశంకర్‌ పర్యటన 5వ తేదీ నుంచి 7 వరకు కొనసాగనుంది. అయితే శ్రీలంక, భారత్‌, జపాన్‌ దేశాల మధ్య ద్వైపాక్షిక సహాకార ఒప్పందంపై 2019లో సంతకాలు చేసినప్పటికీ ఈ ఒప్పందం మధ్య వివాదస్పదంగానే ఉంది. దీనిపై చర్చించే అవకాశం ఉంది.