రైతులు చేస్తున్న ఆందోళనకు హర్యానా రాష్ట్రంలోని జింద్ గ్రామస్థులు మద్ధతు

 

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు హర్యానా రాష్ట్రంలోని జింద్ గ్రామస్థులు మద్ధతుగా నిలిచారు. గురువారం రాత్రి జింద్ -చండీఘడ్ జాతీయ రహదారిపై జింద్ గ్రామస్థులు నిలిచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రెండు గంటలపాటు జాతీయ రహదారిని మూసివేసి గ్రామస్థులు రైతులకు మద్ధతుగా నిరసన తెలిపారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటే తాము చూస్తూ ఊరుకోమని గ్రామస్థులు హెచ్చరించారు. జాతీయ రహదారిని బంద్ చేసి రైతులకు మద్ధతుగా గ్రామస్థులు నినాదాలు చేశారు. రైతులపై లాఠీచార్జీ చేసిన కేంద్రం పై జింద్ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై కేసులు నమోదు చేయడాన్ని గ్రామస్థులు వ్యతిరేకించారు.