సరూర్‌నగర్‌ స్టేడియం నుంచి ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం వరకు వాహనాల ర్యాలీ

 


ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనకు మద్దతుగా ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ స్టేడియం నుంచి ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం వరకు వాహనాల ర్యాలీని నిర్వహిస్తుంది. ఈ ర్యాలీ మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ సూచించారు. విజయవాడ, వరంగల్‌ మార్గంలో వచ్చే వాహనదారులు ఓఆర్‌ఆర్‌ మీదుగా హైదరాబాద్‌లోని ప్రాంతాలకు చేరుకోవాలన్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, వరంగల్‌ వైపు వెళ్లేవారు ఓఆర్‌ఆర్‌ మీదుగా వెళ్లాలన్నారు.