రాకెట్ల దూసుకుపోతున్న బిట్ కాయిన్ విలువ.

 


బిట్ కాయిన్ వెంట ప్రపంచ మొత్తం పరుగులు పెడుతుంటే.. ఎవరిక అందనంత ఎత్తుకు తన విలువను పెంచుకుంటూ రికార్డులు బ్రేక్ చేస్తోంది. కొత్త ఏడాదిలో రికార్డుల మీద రికార్డులను క్రియేట్ చేస్తోంది. 2017 నుంచి క్రమంగా పెరుగుతూ పోతున్న క్రిప్టో కరెన్సీ విలువ రాకెట్ కన్నా ఎక్కువ స్పీడ్‌తో దూసుకెళ్తుంది. దీని విలువ ప్రస్తుతం భారత కరెన్సీల్లో రూ. 31 లక్షల పైచీలుకు ట్రేడ్ అవుతోంది. సరిగ్గా నెల రోజుల క్రితం అంటే.. గత ఏడాది డిసెంబర్ 10న…బిట్ కాయిన్ విలువ రూ. 13,47,636.64 పలికింది. ఇప్పుడు ఆ నెంబర్ తిరగబడింది.. బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ ధర జనవరి 10,2021 (ఆదివారం) రోజుకుసమారు రూ. 31 లక్షలకుపైగా ఎగబాకింది. ఇంతటితో ఆగేలా లేదు. దీర్ఘకాలంలో బిట్ కాయిన్ వ్యాల్యూ 1.46 లక్షల డాలర్లకు చేరుకునే సామర్థ్యాన్ని పొందుతుందని జేపీ మోర్గాన్ సంస్థ గత ఏడాది అంచనా వేసింది. భవిష్యత్‌లో లక్ష డాలర్లకు పైగా చేరుకొనునట్లు మార్కెట్ నిపుణులు అంటున్నారు. కరోనా సంక్షోభం, అమెరికా నూతన అధ్యక్షుడిగా జోబిడెన్ ఎన్నిక కావడం కారణంగా పెట్టుబడిదారుల ఆలోచనలు మారుతున్నాయి. ఇదే ఇప్పుడు క్రిప్టోకరెన్సీ వాల్యూ పెరగడానికి ప్రధాన కారణమని అంతా భావిస్తున్నారు. ప్రపంచ వ్యాపారంలో మారుతున్న పరిణామాలు ఈ క్రమంలో… బిట్ కాయిన్… మరోమారు సర్దుబాటుకు గురి కావొచ్చునని చెబుతున్నారు.