నిరుద్యోగులకు మిశ్రా ధాతు నిగామ్ లిమిటెడ్(MITHANI) శుభవార్త
నిరుద్యోగులకు మిశ్రా ధాతు నిగామ్ లిమిటెడ్(MITHANI) శుభవార్త చెప్పింది. డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం మూడు డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. టెన్త్ విద్యార్హతతో, LMV/HMV లైసెన్స్ కలిగిన వారు దరఖాస్తుకు అర్హులు. ఏడాదికి కనీసం రూ. 100 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థల్లో నాలుగేళ్లు పని చేసిన అనుభవం ఉన్న వారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు తెలుగు/హిందీ మాట్లాడగలగాలి. వయస్సు జనవరి 1 నాటికి 30 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.22, 650 వేతనంగా చెల్లించనున్నారు. మొదట అభ్యర్థులు ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుంది. పని తీరు ఆశించిన తీరులో ఉన్న అభ్యర్థులకు మూడేళ్ల పాటు పని చేసే అవకాశాన్ని కల్పిస్తారు. అభ్యర్థులకు PF, ESI/Medical సదుపాయాలను నిబంధనలకు అనుగుణంగా కల్పిస్తారు.


అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 17న Brahm Prakash DAV School, MIDHANI Township, Hyderabad-500058 అడ్రెస్ లో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఉదయం 7 గంటలలోగా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. 11 గంటలు దాటిన అనంతరం అభ్యర్థులను ఇంటర్వ్యూలకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. కేవలం ఇండియన్స్ మాత్రమే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు డేట్ ఆఫ్ బర్త్, విద్యార్హత, అనుభవం సర్టిఫికేట్లు ఈఎస్ఐ, ఈపీఎఫ్ స్టేట్మెంట్లకు సంబంధించిన ఫొటో కాపీలను తీసుకురావాల్సి ఉంటుంది. రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలను సైతం వెంట తీసుకురావాలని సూచించారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు కోవిడ్ జాగ్రత్తలను పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూడొచ్చు.