నిరుద్యోగులకు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(NFL) శుభవార్తనిరుద్యోగులకు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(NFL) శుభవార్త చెప్పింది. మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆన్లైన్ టెస్ట్ నిర్వహించి అందులో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40 వేల నుంచి రూ.1.40 లక్షల వరకు వేతనం చెల్లించనున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అందుకు సంబంధించిన అర్హతల వివరాలు ఇలా ఉన్నాయి.-కెమికల్ విభాగంలో మొత్తం నాలుగు ఖాళీలను భర్తీ చేస్తుననారు. కెమికల్ ఇంజనీరింగ్ లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసినవారు దరఖాస్తుకు అర్హులు.

-మెకానికల్ విభాగంలో మొత్తం 7 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్/బీఎస్సీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. -ఎలక్ట్రికల్ విభాగంలో మొత్తం 4 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.