టికెట్ ధరలను 10-30 శాతం వరకు ప్రభుత్వం పెంచింది

 


దేశీయ విమాన ప్రయాణాలు మరింత భారమయ్యాయి. టికెట్ ధరలను 10-30 శాతం వరకు ప్రభుత్వం పెంచింది. గతేడాది మే నుంచి జెట్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపిన కేంద్రం.. సవరించిన చార్జీలు ఈ నెల మార్చి 31 వరకు, లేదంటే తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.

సవరించిన చార్జీల ప్రకారం..

- ప్రయాణ కాలం 40 నిమిషాల వరకు ఉంటే రూ. 200 నుంచి గరిష్ఠంగా రూ. 1,800 వరకు,

- 40 నుంచి 60 ప్రయాణ కాలానికి రూ. 300 నుండి రూ. 2,700,

- 60 నుంచి 90 నిమిషాల వరకు రూ.300 నుంచి గరిష్ఠంగా రూ. 2,700 వరకు

- 90 నిమిషాల నుంచి 120 నిమిషాల వరకు ఉంటే రూ. 400 నుండి రూ. 3వేలు,

- 120 నిమిషాల నుంచి 150 నిమిషాల వరకు ఉంటే రూ. 500 నుండి రూ.3,900,

- 150 నిమిషాల నుంచి 180 నిమిషాల వరకు రూ. 600 నుంచి గరిష్ఠంగా రూ. 4,700,

- 180 నిమిషాల నుంచి 210 నిమిషాల వరకు ఉంటే కనిష్ఠంగా రూ. 700 నుంచి గరిష్ఠంగా రూ. 5,600 వరకు చేతి చమురు వదిలించుకోక తప్పదన్నమాటే.