ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11గంటలకు 'మన్‌ కీ బాత్‌'

 


ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11గంటలకు 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. మళ్లీ దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడం, ఓ కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌, అసోం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఏం మాట్లాడుతారోనని ఆసక్తి నెలకొంది. గత కొన్ని రోజులుగా యువత ఉపాధి సమస్యను సోషల్ మీడియాలో లేవనెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్యోగ, ఉపాధి రంగాలపై ఏవైనా ప్రకటన చేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. జనవరి చివరలో మన్‌ కీ బాత్‌లో ప్రధాని ప్రసంగించారు. హైదరాబాద్‌లోని బోయినపల్లిలోని స్థానిక కూరగాయాల మార్కెట్‌లో కుళ్లిపోయిన కూరగాయల నుంచి 500 యూనిట్ల విద్యుత్‌ తయారీ, హర్యానాలోని పంచకుల బారౌట్ పంచాయతీలోని మురికి నీటిని శుద్ధి చేస్తున్న తీరు, అరుణాచల్ ప్రదేశ్ 'మోన్ షుగు' కాగితం తయారీ కళ తదితర స్ఫూర్తివంతమైన కథనాలపై ప్రసంగించారు.