అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పోస్టుల భర్తీకి ఈ నెల 16న ఇంటర్వ్యూలు


 

కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పోస్టుల భర్తీకి ఈ నెల 16న ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. గతేడాది నవంబర్‌లో నిర్వహించిన రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా 10 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. మెరిట్‌ జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 16న నాంపల్లిలోని తమ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపింది.