18 నెలల తర్వాత తిరిగి అందుబాటులోకి జమ్మూకశ్మీర్‌లో 4జీ సేవలు
 జమ్మూకశ్మీర్‌లో 4జీ సేవలను కేంద్ర ప్రభుత్వం నుద్దరించింది. జమ్మూకు స్వయం ప్రతిపత్తి హోదా రద్దు చేసిన నేపథ్యంలో అక్కడ ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపి వేశారు. అయితే నెట్‌ సేవలను దశలవారీగా పునరుద్దరించారు. 4జీ సేవలు మాత్రం 18 నెలల తర్వాత తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జమ్మూకశ్మీర్‌ పరిపాలన అధికారి రోహిత్‌ కన్సాల్‌ తెలిపారు. 2019 ఆగస్టు 5 నుంచి జమ్మూకశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు. 4జీ ఇంటర్‌నెట్‌ సేవలను పురుద్దరించారు.


కాగా, 2019 ఆగస్టు 5 నుంచి జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయగా, ప్రస్తుతం 4జీ ఇంటర్‌నెట్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాగా, గత ఏడాది ఆగస్టు నెలలో ప్రయోగాత్మకంగా గండేర్బల్‌, ఉధమ్‌పూర్‌ జిల్లాల్లో 4జీ సేవలను పునరుద్దరించగా, మిగతా 18 జిల్లాల్లో 2జీ సేవలు కొనసాగుతున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో నియమించిన ప్రత్యేక కమిటీ సలహా ప్రకారం.. పూర్తి శ్రద్దతో భద్రతా పరిస్థితిని సమీక్షించి ఇంటర్నెట్‌ సేవలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. జమ్మూకశ్మీర్‌లో స్వయం ప్రతిపత్తి హోదాను రద్దు చేసిన నేపథ్యంలో ఏవైనా అల్లర్లు, దాడులు జరిగే అవకాశం ఉండడంతో కేంద్రం ఇంటర్‌నెట్‌ సర్వీసులను నిలిపివేసింది. కొన్ని రోజులు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడమే మేలని భావించి నిర్ణయం తీసుకుంది. అయితే 18 నెలల పాటు నిలిపివేసిన ఇంటర్‌నెట్‌ సేవలను తాజాగా పునరుద్దరించబడ్డాయి.