రైలు దహనం కేసులో కీలక నిందితుడు రఫీక్ హుస్సేన్ భటుక్ను 19ఏళ్ల తర్వాత అరెస్టు

 


గుజరాత్ గోద్రాలో 2002లో జరిగిన రైలు దహనం కేసులో కీలక నిందితుడు రఫీక్ హుస్సేన్ భటుక్ను 19ఏళ్ల తర్వాత అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ కుట్రలో పాల్గొన్న ప్రధాన నిందితుల బృందంలో భటుక్ఉన్నట్లు పేర్కొన్నారు. గత 19 ఏళ్లుగా పరారీలో ఉన్న భటుక్ను గోద్రా పోలీసులు పక్కా ప్రణాళికతో.. గోద్రా రైల్వే స్టేషన్కు సమీపంలోని ఉన్న సిగ్నల్ ఫాలియా ప్రాంతంలో అరెస్టు చేసినట్లు పంచమహల్ జిల్లా ఎస్పీ లీనా పాటిల్ తెలిపారు.